Homeజిల్లాలునిజామాబాద్​Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు...

Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ బంగారం గొలుసు దొంగతనం జరిగింది.

నాలుగో ఠాణా (police station) పోలీసుల కథనం ప్రకారం.. పద్మ అనే మహిళ బీడీ కార్ఖానా నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో చైన్​ స్నాచింగ్​ జరిగింది.

గాయత్రి నగర్ మూలమలుపు వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. ఆమె మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లారు.

Chain snatching case : విలువ రూ. 2.5 లక్షలు..

మహిళ మెడలో నుంచి దుండగులు లాక్కెళ్లిన బంగారం గొలుసు బరువు రెండున్నర తులాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అంటే సుమారు రూ. 2.5 లక్షలు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా సీసీ ఫుటేజీ (CCTV footage) లను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.