Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

Kamareddy | వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

నియోజకవర్గాల్లో వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం భిక్కనూరుకు వచ్చింది. ఈ సభ్యులకు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ వివరాలను అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను (Kamareddy and Yellareddy constituency) భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. రైతాంగాన్ని వరదలు కోలుకోలేని విధంగా దెబ్బ తీశాయి. ఈ మేరకు వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర బృందం బుధవారం భిక్కనూరుకు చేరుకుంది. కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) బృంద సభ్యులకు స్వాగతం పలికారు.

Kamareddy | చెరువులు, రహదారుల పరిశీలన..

కేంద్ర బృందం సభ్యులు (central team members) మండలంలో తెగిపోయిన చెరువులు, ధ్వంసమైన రహదారులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు, స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సైతం నష్టం జరిగిన తీరును వివరించారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రం బృందం అధికారులు కామారెడ్డి పట్టణానికి చేరుకోనున్నారు. జీఆర్ కాలనీలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలించనున్నారు. అలాగే కలెక్టరేట్​లో ఫొటో ఎగ్జిబిషన్, వీడియో ప్రజంటేషన్​ను కేంద్ర బృందం తిలకించనుంది.