HomeతెలంగాణMahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా, రైలులో ప్రయాణించినా, విమానంలో ఎక్కినా, స్టేడియంకు వెళ్లినా, లేదంటే థియేట‌ర్‌లో సినిమా చూసేందుకు వెళ్లినా ప్రాణంపై న‌మ్మకం ఉండ‌డం లేదు. తాజాగా ధ‌నుష్‌, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లల్లో రూపొందిన కుబేర మూవీ (Kubera Movie) చూస్తుండగా ఓ ప్రమాద ఘటన జరిగింది. థియేటర్‌లో కుబేర చిత్రం ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుండ‌గా, సీలింగ్ కూలింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. కాని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

Mahabubabad | ప్ర‌మాదం త‌ప్పింది..

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (rashmika mandana) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖర్ కమ్ముల (Sheker kammula) తెర‌కెక్కించిన‌ ‘కుబేర’ జూన్ 20న గ్రాండ్‌గా విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఈ చిత్రం ఫీల్-గుడ్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌లు, మ్యూజిక్ తదితర అంశాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. రిలీజ్ రోజే హిట్ టాక్ పొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే సినిమా బాగుండ‌డంతో థియేట‌ర్స్‌కి సినీ ప్రియులు (Movie Lovers) పోటెత్తుతున్నారు.

మహబూబాబాద్‌లోని (Mahabubabad) ముకుందా థియేటర్‌లో కుబేర సెకండ్ షో ర‌న్ అవుతుండ‌గా, ఆ స‌మ‌యంలో థియేటర్ సీలింగ్ సడన్‌గా కూలిపోయింది. సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన స‌మయంలో పై నుంచి కూలుతున్న సీలింగ్ భాగాలను చూసి ప్రేక్ష‌కులు భయాందోళనకు గురయ్యారు.

కాగా.. ఈ ప్రమాదంలో కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే థియేటర్ సిబ్బంది స్పందించి, గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స అందించారు. ఈ సంఘటన అనంతరం థియేటర్ (theater management) యాజమాన్యంపై తీవ్ర‌మైన ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో (Social media) ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారు థియేట‌ర్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Must Read
Related News