అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ceasefire | భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు సీజ్ ఫైర్‌కు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య చర్చలు ఫలించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల భారత్ డీజీఎంవోకి పాక్ డీజీఎంవోకు ఫోన్ చేశారు. అంతేకాకుండా పాక్ మంత్రి ఇషాక్‌దర్ సైతం ఇదే విధంగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య అమెరికా చర్చలు జరిపింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం సోషల్ మీడియాలో ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Ceasefire | ఉగ్రదాడితో మొదలు..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారని కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంపై పలు ఆంక్షలు విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. అనంతరం మే 7న అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ పేరిట పీవోకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
Ceasefire | ఉలికిపడ్డ పాక్
భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో పాక్ ఉలికిపడింది. భారత్ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు మరణించారు. మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌కు చెందిన కీలక ఉగ్రవాదులు ఈ ఘటనలో మృతి చెందారు. దీంతో ప్రతీకారంలో రగిలిపోయిన పాక్ ఎల్వోసీ వెంబడి సామాన్య పౌరులే లక్ష్యంగా కాల్పులు చేపట్టింది.
Ceasefire | డ్రోన్లు, క్షిపణులతో దాడి
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ దాడులు చేపట్టడంతో పాక్ ప్రతీకారదాడులు చేపట్టింది. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో భారత్‌లోని పలు ప్రాంతాలపై దాడికి యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ త 400 పాక్ డ్రోన్లు, మిసైల్స్‌ను మధ్యలోనే కూల్చివేసింది. ఈ క్రమంలో భారత్ కూడా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై ప్రతిదాడులు చేసింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు పాకిస్తాన్ డీజీఎంవో భారత్ డీజీఎంవో చర్చలు జరిపినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. మే 12న మరోసారి డీజీఎంవో స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు.