అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)Deలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం అందుకుంది. ఈ ఘటన వెనుక ఉగ్రకుట్ర కోణం ఉందనే అనుమానం బలపడుతోంది.
తాజాగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. పేలుడుకి కారణమైన ఐ20 కారుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage)ను అధికారులు గుర్తించారు.సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఒక వ్యక్తి ఆ కారు నడుపుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ మహ్మద్ ఉమర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Delhi Blast | కారు డ్రైవర్‌గా వైద్యుడే?
దర్యాప్తులో భాగంగా కారు మూడు గంటలపాటు ఎర్రకోట (Red Fort) సమీప పార్కింగ్‌లో నిలిపివుంచినట్లు కూడా తెలిసింది. కారు నంబర్ HR26 CE 7674, ఈ వాహనం చివరిసారిగా పుల్వామాకు చెందిన తారీఖ్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అంతేకాక కారుపై పలు ట్రాఫిక్ చలానాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ ఇటీవలే క్లియర్ చేసినట్లు తేలింది. దిల్లీ పేలుడుకి, ఫరీదాబాద్‌లో ఇటీవల బహిర్గతమైన ఉగ్రకుట్రకు మధ్య సంబంధాలు ఉన్నట్లు పోలీసులు (Delhi Police) చెబుతున్నారు. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఢిల్లీలో వాడిన పేలుడు పదార్థాలతో ఒకే రకంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి. రెండు చోట్లా వైద్యుల పాత్ర ఉన్న అంశం కూడా దర్యాప్తును మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.
హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇటీవల జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) మరియు అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ అనే వ్యక్తుల దగ్గర నుంచి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి దాదాపు 3,000 కిలోల మేర ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్స్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు (Delhi Blast), ఫరీదాబాద్ కుట్ర, పుల్వామా కనెక్షన్ ఈ మూడింటి మధ్య సంబంధాన్ని బయటపెట్టేందుకు కృషి చేస్తున్నారు.
1. CCTV footage has surfaced just before the blast.
2. An I-20 car is seen in the footage.
3. The driver of the car is wearing a black mask.
4. According to sources, the driver’s name is Mohammad Umar.
5. Mohammad Umar is associated with the Faridabad module pic.twitter.com/kuphqEkU0u
— Kunal Verma (@thekunalverma) November 11, 2025
