228
అక్షరటుడే, బోధన్: CCS team raid | నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ మండలం అందాపూర్ గ్రామ శివారులో బుధవారం పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి చేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సాయంకాలం సమయంలో CCS ఇన్ఛార్జి ఏసీపీ మస్తాన్ అలీ సూచనతో ఇన్స్పెక్టర్ డీ సాయినాథ్ , ఎస్ఐ విఠల్, సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు.
CCS team raid | నగదు, వాహనాల స్వాధీనం..
పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5,250 నగదు, 8 సెల్ ఫోన్లను, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు.