అక్షరటుడే, వెబ్డెస్క్: Caste census | కులగణనపై కేంద్ర ప్రభుత్వం (central government) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని డిసిషన్ తీసుకుంది. ఇందులో భాగంగా 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశ కులగణన (caste census) ప్రారంభం కానుంది. రెండో దశ 2027 మార్చి 1 నుంచి రెండో దశ గణన చేపట్టనుంది. తొలిదశలో భాగంగా ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లో కులగణన చేయబోతోంది. కాగా.. కులగణనపై కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది.
