SRH vs CSK | ఫ్రీ హిట్ కొట్టలేవా?.. కసురుకున్న కావ్య మారన్!(వీడియో)
SRH vs CSK | ఫ్రీ హిట్ కొట్టలేవా?.. కసురుకున్న కావ్య మారన్!(వీడియో)

అక్షరటుడే, వెబ్​డెస్క్​:SRH vs CSK | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్(Kavya Maran) తమ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్(IPL) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఆటగాళ్లు చేసిన తప్పిదాలతో సహనం కోల్పోయింది. క్యాచ్‌లు డ్రాప్ చేసినప్పుడు.. ఫ్రీ హిట్ బాల్స్ వదిలేసినప్పుడు వైల్డ్ రియాక్షన్స్ ఇచ్చింది. గ్యాలరీలో తన హవాభావాలతో నవరసాలు పండించింది. ప్రస్తుతం కావ్య మారన్ వైల్డ్ రియాక్షన్స్‌కు సంబంధించిన వీడియోలు(Videos) నెట్టింట వైరల్‌గా మారాయి.

ముఖ్యంగా కామింద్ మెండీస్(Kamind Mendis).. ఫ్రీ హిట్ బాల్‌ను వదిలేయడంతో కావ్య మారన్ అసహనానికి గురైంది. నూర్ అహ్మద్ నోబాల్ వేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌(SRH)కు ఫ్రీ హిట్ లభించింది. కానీ కామిందు మెండిస్ బంతిని టచ్ చేయలేకపోయాడు. దాంతో ఈ ఫ్రీ హిట్ కాస్త డాట్ బాల్‌గా మారింది. దాంతో చిర్రెత్తుకుపోయిన కావ్య మారన్.. ‘ఫ్రీ హిట్ బాల్ కూడా కొట్టలేవా’ అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్​గా మారింది. అంతకుముందు కామిందు మెండీస్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పుడు ‘వారెవ్వా వాటే క్యాచ్’  అంటూ మెచ్చుకున్న కావ్య పాప.. హర్షల్ పటేల్(Harshal Patel) ఈజీ క్యాచ్ వదిలేయడంపై వైల్డ్‌గా రియాక్ట్ అయ్యింది. గట్టిగా అరిచింది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై ఆరెంజ్ ఆర్మీ(Orange Army) గెలుపు జెండా ఎగురవేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.