అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipal Elections | పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) భాగంగా ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. బుధవారం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు.
Armoor Municipal Elections | ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో..
ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) పరిధిలో 36 వార్డులు ఉండగా మొత్తం 63,972, మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో 154 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ 36 వార్డులో పోటీ చేస్తుండగా బీజేపీ 34 సీట్లు, బీఆర్ఎస్ 35, ఎంఐఎం 4, ఆప్ 4, బీఎస్పీ 3, జనసేన 2, సీపీఎం 1, స్వతంత్రులు 35 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
Armoor Municipal Elections | అభ్యర్థుల తరఫున రంగంలోకి..
ఆయా వార్డుల అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారంలో దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని ఆర్మూర్ మున్సిపాలిటీపై జెండా ఎగరేయాలనే సంకల్పంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత పాలనను ఎండగడుతూ, తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Armoor Municipal Elections | జీవన్‌రెడ్డి సైతం..
మరోవైపు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ పట్టణంలో చేసిన అభివృద్ధి పనులను, కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆక్రమాలను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Armoor Municipal Elections | వినయ్‌రెడ్డి దూకుడు..
అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy) సైతం దూకుడు పెంచారు. రెండేళ్లలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే మాటలకే పరిమితమయ్యారంటూ బీజేపీ,బీఆర్ఎస్ నేతల తీరును ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆర్మూర్ అభివృద్ధి కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు.

