Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

Limbadri Gutta | లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కొండపై ఉత్సవమూర్తులకు బలిప్రదానం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్ : Limbadri Gutta | భీమ్​గల్ శివారులోని శ్రీ మన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్టపై (Limbadri Gutta) లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కొండపై మొదటి అంతస్తులో ఉన్న కళ్యాణ మండపంలో లక్ష్మీ నృసింహాస్వామి (Lakshmi Narasimhaswamy) ఉత్సవమూర్తులకు ఆలయ పండితులు హవనం, బలిప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

Limbadri Gutta | తరలివచ్చిన భక్తులు

బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలివచ్చారు. గర్భాలయంలో ఉదయం సుప్రభాతసేవతో మొదలుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, విజయసారథి, ప్రణీత్, నారాయణ, మహేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News