అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | నగరంలోని బహుజన కాలనీలో (Bahujana Colony) బండ పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు బోనాలతో ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు(Nuda Chairman Kesha Venu), కాంగ్రెస్ నాయకులు రామర్తి గోపి (Ramarthi Gopi), వేణు రాజ్, పార్థసారథి, రాజేష్, మల్యాల గోవర్ధన్, ట్రాన్స్జెండర్ అసోసియేషన్ నాయకులు గంగా, జరినా, రక్ష, కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మారుతి, లక్ష్మి, అలీ తదితరులు పాల్గొన్నారు.
Bonalu Festival | ఆర్మూర్లో..
అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని స్మైల్స్ ది స్కూల్లో సోమవారం బోనాల పండుగను సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలను ఊరేగించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పట్టణంలో స్మైల్స్ ది స్కూల్లో బోనాల సంబురం