అక్షరటుడే, ఇందూరు: Ippakayala Sumitra Kishore | తనను గెలిపిస్తే అభివృద్ధికి పెద్దపీట వేస్తానని 24వ డివిజన్ అభ్యర్థిని ఇప్పకాయల సుమిత్ర కిషోర్ అన్నారు. ఈ మేరకు డివిజన్లోని పలు కాలనీల్లో శుక్రవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Ippakayala Sumitra Kishore | బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి..
నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఇప్పకాయల సుమిత్ర కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకున్నారు. కార్పోరేటర్‌గా గెలిపిస్తే తప్పనిసరిగా డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శ డివిజన్‌గా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో..
ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanapal Suryanarayana) సహకారంతో డివిజన్లోని అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటికే డివిజన్లో రూ.కోటితో పలు అభివృద్ధి పనులు చేశామని.. తాను కార్పొరేటర్‌గా గెలిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని వివరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు పలు హామీలు ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
