అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Elections | మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
Nizamabad Municipal Elections | నగరాభివృద్ధి కోసం రూ.కోట్లలో నిధులు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర అభివృద్ధి కోసం సుమారు రూ.170 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే ప్రతి డివిజన్‌కు రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. ఈసారి మేయర్ పదవి తప్పకుండా బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
మన ఇందూరు.. మన మేయర్..
మన ఇందూరు మన మేయర్ (Our Indur, Our Mayor) నినాదంతో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. బీజేపీ గెలిస్తే జరిగే సంక్షేమ పథకాలను వారికి వివరించాలని సూచించారు. మంగళవారం నుంచి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ర్యాలీలు.. ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.