అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దినేష్ కులచారి (District President Dinesh Kulachari) నేతృత్వంలో గురువారం నగరంలోని 22వ డివిజన్ నుంచి పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (Prime Minister Modi) పాలన పట్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ‘మన ఇందూరు – మన మేయర్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ జిల్లాలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. కాగా బీజేపీలోకి మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తం, తాటికొండ రాము, ఆకుల శ్రీనివాస్ రాజ్ కుమార్, ఆనంద్, శ్రీనివాస్ తదితరులు చేరారు.
BJP Nizamabad | ఆర్మూర్ బీజేపీలో పలువురి చేరిక
అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలో 6వ వార్డు నుంచి పుట్టి మురళి దంపతులు,19వ వార్డు నుండి త్రివేణి శ్రీకాంత్ దంపతులు, 25వ వార్డు నుంచి వినయ్, 30వ వార్డు నుంచి వినోద్‌తో సహా సుమారు 200 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, యమాద్రి భాస్కర్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
