Homeతాజావార్తలుBhatti Vikramarka | బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీ.. డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka | బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీ.. డిప్యూటీ సీఎం భట్టి

బీసీ రిజర్వేనషన్ల కోసం కాంగ్రెస్​ చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీ బిల్లులను అడ్డుకుంటోందని విమర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ అడ్డుపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్​ కల్పించాలని కాంగ్రెస్​ నిర్ణయించిందన్నారు. ఈ మేరకు కుల గణన చేపట్టి, సైంటిఫిక్​ డేటా ఆధారంగా బిల్లులు రూపొందించామని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ బిల్లులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) అడ్డుకుంటోందని విమర్శించారు. ఇది బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhatti Vikramarka | బిల్లును పాస్​ చేయించాలి

బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు బీజేపీ తప్ప అన్ని పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారని భట్టి గుర్తు చేశారు. బీసీలకు న్యాయం చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఈ మేరకు న్యాయస్థానాల్లో సైతం పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్​లో ఆమోదించకపోవడంతోనే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్​ (Bandi Sanjay), కిషన్​రెడ్డి (Kishan Reddy) ప్రధానితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బీసీ బిల్లును పాస్ చేయించాలని ఆయన డిమాండ్​ చేశారు. బీజేపీ తీరుతోనే రేపు రాష్ట్రంలో బీసీ బంద్​ జరుగుతుందన్నారు.

Bhatti Vikramarka | సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

​భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి బోనస్​ కింద సింగరేణి కార్మికులకు (Singareni Workers) రూ.400 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.