అక్షరటుడే, ఇందూరు: BJP district president Dinesh | జిల్లాలోని రుద్రూర్(Rudrur), బాన్సువాడ(Banswada), నిజామాబాద్లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్లో బీజేపీ(BJP Nizamabad) రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy)కి వినతిపత్రం అందజేశారు.
BJP district president Dinesh | ఉద్దేశపూర్వకంగా దాడులు..
దినేష్ కులాచారి మాట్లాడుతూ.. హిందువులపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. బాధితులు స్థానిక పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కనీస స్పందన లేదని పక్షపాత ధోరణితో బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఇకనైనా నిందితులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు జరుగుతున్న సున్నితమైన ప్రాంతాల్లో (Telangana politics)తక్షణమే పోలీసు బలగాలని మోహరించి(Law and order) భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందువులకు భద్రత కల్పించాలన్నారు.
