అక్షరటుడే, ఇందూరు: BJP B-Forms | నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అభ్యర్థులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) బీ ఫామ్‌లు అందజేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివాకం ఈ కార్యక్రమం నిర్వహించారు.
BJP B-Forms | పాత కొత్త కలయికతో అభ్యర్థుల ఎంపిక..
వారు మాట్లాడుతూ నగరంలో పాతకొత్త కలయికతో అభ్యర్థులకు ఎంపిక చేశామని తెలిపారు. నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే 40 అభ్యర్థులను ప్రకటించామన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎంపిక ప్రక్రియ నిర్వహించామని తెలిపరాఉ.
కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేద్దాం..
ఈసారి ప్రణాళికతో ముందుకెళ్దామని.. కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేద్దామని దినేష్ కులాచారి (district president Dinesh Kulachari), ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం అందించామని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని వారు సూచించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.