అక్షరటుడే, ఇందూరు : BJP 19th Division Development | నగరంలోని 19వ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీజేపీ 19వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి (Corporator Candidate) నాగోళ్ల లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు.
BJP 19th Division Development | బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది..
నిజామాబాద్ (Nizamabad) అర్బన్‌లో అవినీతి లేకుండా అభివృద్ధి కావాలంటే బీజేపీ (BJP) అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో పూర్తిస్థాయిలో డివిజన్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు..
ఆదరించండి అవకాశం ఇవ్వండి..
తనను ఆదరించే అవకాశం ఇస్తే 19వ డివిజన్‌ను ముందుకు తీసుకెళ్తానని నాగోళ్ల అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి అవినీతి జరగకుండా లబ్ధిదారులకు అందేలా చేస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
