అక్షరటుడే, ఇందూరు : BJP Urban Corporator Candidates | బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని పాలిటెక్నిక్ మైదానం (Polytechnic Ground)లో బీజేపీ అభ్యర్థులు ఎర్రం సుధీర్, న్యాలం రాజు, బూర్గుల ఇందిర వినోద్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాకర్స్‌తో మాట్లాడారు.
BJP Urban Corporator Candidates | కేంద్ర పథకాలతో పేదలకు లబ్ధి..
కేంద్రంలో బీజేపీ పాలనలో అనేకమంది పేదలు, రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్య అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వంలో అనేక ప్రజాహిత పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) ద్వారా పేదలకు ఇళ్లు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు.
BJP Urban Corporator Candidates | నగరాభివృద్ధికి కృషి చేస్తున్నాం..
నగర అభివృద్ధిలో భాగంగా రహదారులు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య కార్యక్రమాలు, విద్యుత్ సరఫరా మెరుగుదల వంటి అంశాల్లో బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధి పథంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు (BJP Leaders) , కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ధన్పాల్ (MLA Dhanpal) అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముద్ర యోజన, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు. మహిళల భద్రత, సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వం (BJP Government) తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
