అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TruAlt Bioenergy IPO | దేశంలో అతిపెద్ద బయోఫ్యుయల్ తయారీదారు అయిన ట్రూఆల్ట్ బయో ఎనర్జీ కంపెనీ ఐపీవోకు వచ్చింది. సబ్స్క్రిప్షన్ 25 నుంచి 28 వరకు కొనసాగనుంది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 81 గా ఉంది.
ట్రూఆల్ట్ బయోఎనర్జీ(TruAlt Bioenergy) దేశంలోని అతిపెద్ద బయోఫ్యూయల్స్(Biofuels) ఉత్పత్తిదారులలో ఒకటి. ప్రధానంగా ఇథనాల్(Ethanol) ఉత్పత్తిలో, భారత బయోఫ్యూయల్స్ పరిశ్రమలో ప్రముఖ మరియు వైవిధ్యభరితమైన కంపెనీగా వ్యూహాత్మకంగా స్థానం పొందింది. స్థాపిత సామర్థ్యం ఆధారంగా దేశంలో అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుగా నిలుస్తోంది. 2018లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ (SATAT) పథకం కింద CBG యొక్క మొదటి ఉత్పత్తిదారులలో ఒకరిగా ఉంది. ఇథనాల్ తయారీలో రెండోతరం(2G) ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(SAF) అనుబంధ జీవరసాయనాలను ఉత్పత్తి చేయడానికి కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తోంది.
ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 839.28 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. 1.51 కోట్ల తాజా షేర్ల జారీ ద్వారా రూ. 750 కోట్లు, 18 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించి రూ. 89.28 కోట్ల వరకు సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా సమకూరిన ఆదాయాన్ని 300 KLPD సామర్థ్యం గల TBL యూనిట్ 4 వద్ద ఇథనాల్ ప్లాంట్‌లో ధాన్యాలను అదనపు ముడి పదార్థంగా ఉపయోగించుకోవడానికి, మల్టీ ఫీడ్ స్టాక్ కార్యకలాపాలకు మూలధన వ్యయం కోసం, వర్కింగ్ క్యాపిటల్(Working capital) అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఆర్థిక పరిస్థితి : 2024 31 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం రూ. 1,280.19 కోట్లు కాగా.. 2025 31 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 1,968.53 కోట్లకు చేరింది. ఇదే సమయంలో పన్ను తర్వాత లాభం రూ. 31.81 కోట్లనుంచి రూ. 146.64 కోట్లకు పెరగ్గా.. ఆస్తులు రూ. 2,419.08 కోట్లనుంచి రూ. 3,029.73 కోట్లకు వృద్ధి చెందాయి.
ధరల శ్రేణి : ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.472 నుంచి రూ.496 గా నిర్ణయించారు. లాట్ సైజు 30 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్(Lot) కోసం గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ.14,880 తో దరఖాస్తు చేసుకోవాలి.
కోటా, జీఎంపీ : క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 81 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో ఒక లాట్‌కు 16 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
సబ్స్క్రిప్షన్ ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 25
ముగింపు తేదీ : సెప్టెంబర్ 29
షేర్ల అలాట్మెంట్ : సెప్టెంబర్ 30
లిస్టింగ్ తేదీ : అక్టోబర్ 3(బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతుంది)