ePaper
More
    HomeజాతీయంChhattisgarh | బీజాపూర్‌లో అతిపెద్ద ఆప‌రేష‌న్‌.. 20 వేల మంది బ‌ల‌గాల‌తో కూంబింగ్‌

    Chhattisgarh | బీజాపూర్‌లో అతిపెద్ద ఆప‌రేష‌న్‌.. 20 వేల మంది బ‌ల‌గాల‌తో కూంబింగ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Chhattisgarh | వ‌చ్చే మార్చి నాటికి న‌క్స‌ల్స్‌(Naxals)ను తుద‌ముట్టిస్తామ‌ని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశ‌గా చర్యలు చేపట్టింది. చ‌త్తీస్‌గ‌ఢ్‌(Chhattisgarh)లో అతిపెద్ద ఆప‌రేష‌న్‌ను ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 1,000 మందికి న‌క్స‌ల్స్ ఉన్నార‌న్న నిఘా వ‌ర్గాల‌ స‌మాచారంతో మూడు రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను(Security forces) రంగంలోకి దించింది.

    మావో అగ్ర‌నేత హిడ్మాతో(Maoist leader Hidma) పాటు ప‌లువురు కేంద్ర క‌మిటీ స‌భ్యులే టార్గెట్‌గా ఈ ఆప‌రేష‌న్‌ను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన భద్రతా సిబ్బంది ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇప్ప‌టికే ఐదుగురు నక్సల్స్ మరణించారు. 48 గంటలకు పైగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ ముగిసే సరికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

    Chhattisgarh | క‌ర్రెగుట్ట‌లను చుట్టుముట్టిన బ‌ల‌గాలు

    డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు శాఖ‌లలోని అన్ని విభాగాలు, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ కమాండో బెటాలియన్స్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) వంటి వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. సున్నితమైన ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట(Karregutta Encounter) కొండలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ద‌ట్ట‌మైన అడ‌వులు, పెద్ద పెద్ద కొండ‌ల‌తో మావోయిస్టుల‌కు అత్యంత సురిక్ష‌తంగా భావించే ఈ ప్రాంతంలో అణువ‌ణువూ జ‌ల్లెడ ప‌డుతున్నాయి. నక్సల్స్ తప్పించుకునే అన్ని మార్గాలను కత్తిరించాయి. క‌ర్రెగుట్టల చుట్టూ పెద్ద సంఖ్య‌లో పేలుడు ప‌దార్థాలు అమ‌ర్చిన మావోలు.. అటువైపు ఎవ‌రూ రావొద్ద‌ని ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న‌లో హెచ్చ‌రించారు. న‌క్స‌ల్స్ హెచ్చ‌రిక‌ల‌కు ఏమాత్రం వెరువ‌ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు బాంబు నిర్వీర్య‌క బృందాల స‌హాయంతో ముందుకు సాగుతున్నాయి. క‌ర్రెగుట్ట‌ల‌ను చుట్టుముట్టి కూంబింగ్ చేప‌ట్టాయి.

    Chhattisgarh | మావోల‌కు కోలుకోలేని దెబ్బ‌..

    మార్చి 31, 2026 వరకు దేశంలో నక్సలిజాన్ని అంత‌మొందిస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) గ‌తంలోనే ప్ర‌క‌న‌టించారు. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు దండ‌కారాణ్యాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నాయి. దీంతో వ‌రుస‌గా ఎన్‌కౌంట‌ర్లు(Encounters) జ‌రుగ‌డం, పెద్ద సంఖ్య‌లో న‌క్స‌ల్స్ చ‌నిపోవ‌డం జ‌రిగింది. గ‌త జ‌న‌వ‌రి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు దాదాపు 150 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 124 మందిని నక్సల్స్ కేంద్రంగా పిలువబడే బస్తర్ డివిజన్‌(Bastar division)లో హతమార్చారు. అదే ఊపులో జార్ఖండ్‌(Jharkhand)లో కూడా కేంద్రం నక్సల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంది. గత వారం జార్ఖండ్‌లోని బొకారో(Bokaro) జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సల్స్ మరణించారు. వారిలో రూ. కోటి రివార్డు ఉన్న ఒక అగ్ర నాయకుడు కూడా ఉన్నారు.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...