ePaper
More
    HomeజాతీయంBalochistan | పాకిస్తాన్​కు బిగ్​ షాక్​.. కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ

    Balochistan | పాకిస్తాన్​కు బిగ్​ షాక్​.. కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Balochistan | పాకిస్తాన్(Pakistan)​కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశాన్ని భారత్​ ఇటీవల ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​తో కోలుకోలేని దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్​లోని వ్యూహాత్మక నగరమైన సురబ్​ను బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ (BLA) తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నగరంలో సుమారు 40 వేల జనాభా ఉంటుంది.

    Balochistan | దేశాన్ని కాపాడుకోలేని పాక్​..

    పాకిస్తాన్​ తన సొంత దేశంలో అనేక సమస్యలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా భారత్​(India)పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం పతనావస్థలో ఉన్న భారత్​పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రవాదులు దాడి(Terrorists Attack) చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే.

    అయితే పాకిస్తాన్ ఆర్మీ (Pakistan Army), ఐఎస్​ఐ (ISI) కలిసి ఉగ్రవాదులను భారత్​పై ఉసిగొల్పుతుంటే.. ఆ దేశంలోని బీఎల్​ఏ (BLA) మాత్రం వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్(Balochistan) స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థ కొద్ది రోజులుగా పాక్​ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా సురభ్​ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలోని తమ నగరాన్ని కాపాడుకోలేని పాక్​ భారత్​పైకి కయ్యానికి కాలు దువ్వుతుండటం గమనార్హం.

    Balochistan | ప్రభుత్వ భవనాలకు నిప్పు

    పాకిస్తాన్​లోని సురభ్​ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ పోలీస్ స్టేషన్లు(Police Stations), ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా క్వెట్టా-కరాచీ హైవే(Quetta-Karachi Highway)పై తనిఖీలు కూడా చేపడుతోంది. దీంతో బీఎల్​ఏ రెచ్చిపోతుండటంతో పాకిస్తాన్​ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు.

    Balochistan | స్వాతంత్ర్య బలూచిస్తానే లక్ష్యంగా..

    స్వాతంత్ర్య బలూచిస్తానే లక్ష్యంగా బీఎల్​ఏ ఏర్పాటు అయింది. అయితే గతంలో బీఎల్​ఏపై పాక్​ ప్రభుత్వం (Pakistan Government) అనేక నిర్బంధాలు అమలు చేసింది. ఇటీవల బలంగా తయారైన బీఎల్​ఏ పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్​లోని మంగుచోర్​ పట్టాణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్​ఏ, తాజాగా సురభ్​ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత్​ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్​ బీఎల్​ఏ దాడులతో అతలాకుతలం అవుతోంది. తన నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాక్​ సైనం కశ్మీర్​ గురించి మాట్లాడుతుండటం గమనార్హం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...