అక్షరటుడే, కామారెడ్డి : Election Money Distribution | బిచ్కుంద మున్సిపాలిటీలో (Bichkunda Municipality) జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు, మద్యం పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవులు అన్నారు.
ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ (Kamareddy Collector), ఎస్పీకి బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిచ్కుంద పట్టణంలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఓ ఇంట్లోకి ప్రవేశించి డబ్బులను ఓటర్లకు పంపిణీ చేశారని ఆరోపించారు.
Election Money Distribution | మద్యం, మటన్, చికెన్ పంపిణీలు..
ఓటర్లకు మద్యం, మటన్, చికెన్ భారీ స్థాయిలో పంపిణీ చేయడం జరిగిందని సంజీవులు పేర్కొన్నారు. వీటిని పంపిణీ చేసేటప్పుడు స్థానికులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఇలా ఓటర్లకు మద్యం, డబ్బులు, మాంసం పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్లను మభ్యపెడుతున్నట్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి బిచ్కుందలో ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. ఎన్నికల చట్టాన్ని ఉల్లగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.