అక్షరటుడే, వెబ్డెస్క్:Spirit Movie | అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత,యానిమల్ Animal సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). యానిమల్ సినిమా సృష్టించిన అరాచకం అంతా ఇంతాకాదు. ఈ మూవీకి పాన్ ఇండియా లెవల్(Pan India Level)లో రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీసుకురాబోతున్నారు డైరెక్టర్ వంగా. సెకండ్ పార్ట్ టైటిల్ ‘యానిమల్ పార్క్’(Animal Park) అంటూ ముందే టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇక ఇందులోనూ రణబీర్, రష్మిక, త్రిప్తి, అనిల్ కపూర్ తోపాటు.. మరికొంత మంది బీటౌన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది.
Spirit Movie | ఇక ఆగేదే లేదు..
ఆ సినిమాకి ముందు ప్రభాస్ (Prabhas) స్పిరిట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుండి ఎప్పుడు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళతారు అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇటీవల మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందంటూ సోషల్ మీడియా(Social Media)లో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై నిర్మాత భూషణ్ కుమార్(Producer Bhushan Kumar) తాజాగా క్లారిటీ ఇచ్చారు. మూవీ షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్స్ పంచుకున్నారు. 2, 3 నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2027లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
సందీప్ వంగాతో సినిమా కంటే ముందే ప్రభాస్ ప్రశాంత్ వర్మ(Prabhas Prashanth Varma)తో సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. దానిపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. మారుతి డైరెక్షన్‌లో రాజా సాబ్(Raja Saab) చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. ఫౌజీ కూడా లైనప్‌లో ఉంది. దీని తర్వాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. దీని కన్నా ముందే మంచు విష్ణు Manchu Vishnu డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో డార్లింగ్ గెస్ట్ రోల్ చేయనున్నారు.. ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన ఛార్మింగ్ లేడీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. బాలీవుడ్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లను కూడా సందీప్ ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.