భీమ్‌గల్, అక్షరటుడే: Bheemgal Polling | భీమ్‌గల్ మున్సిపాలిటీలో (Bheemgal Municipality) బుధవారం నిర్వహించిన రెండో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని మొత్తం 12 వార్డులకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది.
Bheemgal Polling | ఓటింగ్ వివరాలు ఇలా..
పట్టణంలో మొత్తం ఓటర్లు 14,045 మంది కాగా, వీరిలో పురుషులు 6,616, మహిళలు 7,429 మంది ఉన్నారు. మొత్తం 9,800 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 4,148 మంది, మహిళలు 5,652 ఉన్నారు. మున్సిపాలిటీలో మొత్తంగా 69.78 శాతం పోలింగ్ నమోదైంది.
స్ట్రాంగ్‌రూంకు బ్యాలెట్‌బాక్స్‌లు..
ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాల మేరకు ఎన్నికల యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్రూంనకు తరలించారు.