అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Lava Bold N1 | దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన లావా(Lava).. మార్కెట్లోకి మరో మోడల్‌ను తీసుకువస్తోంది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో మంచి ఫీచర్స్ తో లావా బోల్డ్ ఎన్1 మోడల్‌ను లాంచ్ చేసింది. ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా క్లీన్ యూఐతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫోన్ సేల్స్ అమెజాన్(Amazon), లావా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్ ఫీచర్స్ తెలుసుకుందామా..
Display :
6.75 అంగుళాల హెచ్‌డీ+ నాచ్ డిస్‌ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్. IP54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్.
Processor :
యూని ఎస్‌వోసీ టీ606 అక్టాకోర్ ప్రాసెసర్.
Operating system :
ఆండ్రాయిడ్ 14.
Camera :
13 మెగాపిక్సెల్ ఏఐ డ్యుయల్ రేర్ కెమెరాతోపాటు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.
Battery :
5000 mAh. 10w సపోర్ట్. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ చార్జర్.
Security features..
సురక్షిత అన్‌లాకింగ్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింగ్ స్కానర్ అమర్చారు. ఫేస్ అన్‌లాక్ సౌకర్యమూ ఉంది.
Colors :
స్పార్క్లింగ్ ఐవరీ, రేడియంట్ బ్లాక్.
Variant :
4 GB రామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో విడుదలవుతున్న ఫోన్ ధర రూ. 5,999. Amazon pay ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.