Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బీసీలు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

Banswada | బీసీలు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

బీసీలు ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోగలుగుతారని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్​ పేర్కొన్నారు. ఈ మేరకు బాన్సువాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) రాష్ట్ర నాయకుడు పిట్ల శ్రీధర్ అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం బీసీ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించే బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Banswada | రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..

రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శ్రీధర్​ డిమాండ్ చేశారు. రెడ్డి వర్గానికి చెందిన ఓ వ్యక్తి బీసీ రిజర్వేషన్లపై (BC reservations) కోర్టులో కేసు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో 9 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు.

విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలని శ్రీధర్ అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వనం గంగాధర్, వారాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల రాజులు, అచ్చుకట్ల జీవన్, బాలకృష్ణ, లింగం, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.