అక్షరటుడే, భీమ్‌గల్: Bathukamma Sarees | బతుకమ్మ పండుగకు (Bathukamma festival) రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక చీరలు మహిళా సంఘాల సభ్యులకే కాకుండా మహిళలందరికీ పంపిణీ చేయాలని డీసీసీ కార్యదర్శి నల్లవెల్లి భోజగౌడ్, బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సేపూరు చరణ్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
భీమ్‌గల్‌లో (Bheemgal) బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కానుక చీరల పంపిణీ అభాసుపాలు కాకుండా మహిళలందరికీ చీరలు అందించేలా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ చూపాలని కోరారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్ పాల్గొన్నారు.