అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో బస్తీ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బస్తీ దవాఖానలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పెట్టిన బస్తీ దవాఖానాలను కేంద్ర ఆర్థిక సంఘం సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బస్తీ దవాఖానాల్లో మందులు, బీపీ మిషన్లలో బ్యాటరీలు లేవు అన్నారు. ఉద్యోగులకు జీతాలు సైతం సక్రమంగా చెల్లించడం లేదని ఆయన అన్నారు.
Harish Rao | మందులు లేక ఇబ్బందులు
బస్తీ ప్రజలకు వైద్యం అందించాలని కేసీఆర్ హయాంలో 450 దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు (Harish Rao) చెప్పారు. వాటిలో 110 రకాల మందులు, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి గురించి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై (KCR) కోపంతో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కిట్ పథకం తీసేశారని విమర్శించారు.
Harish Rao | ఆదాయం కోసం గడువు పెంచారు
సీఎం రేవంత్‌రెడ్డికి మద్యం దుకాణాలపై ఉన్న దృష్టి పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానాలపై లేదని హరీశ్‌రావు విమర్శించారు. జనం మద్యం తాగాలి, ఖాజానా నిండాలన్నదే రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. ఎవరూ అడగకున్నా మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును పెంచారని చెప్పారు. రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు చేశారన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency) బోరబండ డివిజన్ వినాయకరావు నగర్‌లో బస్తీ దవాఖానాను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. హెల్త్ చెకప్ చేయించుకొని, డాక్టర్ల సమస్యలను తెలుసుకున్నారు.