అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assam Cabinet | అస్సాం మంత్రివర్గం (Assam Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహు భార్యత్వంపై నిషేధం విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. త్వరలో దీనిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. అస్సాంలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నాయి.
ఈ క్రమంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ఇప్పటి నుంచే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పలు వర్గాల్లో ప్రస్తుతం బహుభార్యత్వం అమలులో ఉన్న విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలో దీనిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ మేరకు దానికి సబంధించిన బిల్లు (The Assam Prohibition of Polygamy Bill)ను ఈనెల 25న అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ఆదివారం కేబినెట్ ఆమోదం తెలిపింది.
Assam Cabinet | ఏడేళ్ల జైలు శిక్ష
బహుభార్యత్వ నిషేధ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్ సంతకం చేస్తే చట్ట రూపం దాల్చనుంది. ఈ చట్టం అమలులోకి వస్తే ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకున్న వారికి కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. సంబంధిత కేసుల్లో దోషిగా తేలినవారికి ఏడేళ్లపాటు శిక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బాధిత మహిళలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయడానికి నిధిని సైతం ఏర్పాటు చేయనున్నారు. అస్సాం (Assam)లో ఆరో షెడ్యూల్ ఉన్న పలు ప్రాంతాలకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపులు మంత్రివర్గం పేర్కొంది. కాగా ఈ షెడ్యూల్ షెడ్యుల్ తెగలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి అందిస్తోంది.
Assam Cabinet | ఆయుధాలు..
రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్థానిక ప్రజలు ఆయుధ లైసెన్స్‌లు ఇస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) తెలిపారు. మొదటి విడత లెసెన్స్‌ల జారీ ప్రక్రియ ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామన్నారు. లైసెన్స్‌ల కోసం ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. అధికారులు వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి మాత్రమే లైసెన్స్‌లు మంజూరు చేస్తారన్నారు.
