అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akhanda 2 Teaser | నందమూరి బాలయ్యకి ఈ జనరేషన్ లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే మాములు విషయం కాదు. చిన్న పిల్లాడు కూడా జై బాలయ్య (Jai Balayya) అంటుంటాడు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ 2: తాండవం సినిమా రూపొందుతుండగా, ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది.
Akhanda 2 Teaser | రికార్డుల బాలయ్య..
ఇక సోమవారం విడుదలైన ఈ టీజర్ Teaser యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. కేవలం 24 గంటల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పాటు, 5.90 లక్షలకు పైగా లైక్‌లను సాధించి యూట్యూబ్(You Tube)లో ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతపై చిత్ర నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్(Thaman background music) అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో 2021లో రిలీజైన అఖండ కు ఇది సీక్వెల్. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ఈ సినిమా విడుదల కానుంది.
టీజర్‌లోని రెండో షాట్‌లో యాగం జరుగుతున్న సమయంలో పైనుంచి ఏదో పడి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే.. బాలయ్య తన కాలితో దానిని భస్మం చేసే తీరు హైఎనర్జీతో పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ టీజర్‌లోని రెండు మూడు అంశాలు ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అనే విషయాన్ని రుచి చూపించాయి. బోయపాటి Boyapati, బాలయ్య కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనే సంకేతాలు అందించింది. గ్రాఫిక్ వర్క్ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉంది. ఈ టీజర్ సినిమాపై రెండితలు అంచనాలు పెంచేలా కనిపించింది. ఈ దసరా నందమూరి అభిమానులకు నిజమైన పండుగను తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.