అక్షరటుడే, మెండోరా: Digital sand policy | డిజిటల్ పద్ధతిలో ఇసుకను బుకింగ్ చేసుకునే విధానంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు మెండోరా మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో (MPDO office) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎంపీడీవో లక్ష్మణ్, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సుహాసిని (SI Suhasini) అధ్యక్షత వహించారు.
Digital sand policy | ఇసుక బుకింగ్ విధానం..
ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీలు, గ్రామ పాలన అధికారులు పాల్గొని, డిజిటల్ ఇసుక బుకింగ్ విధానం, ప్రభుత్వ నిబంధనలు, అక్రమ ఇసుక రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిజిటల్ విధానం ద్వారా ఇసుక సరఫరా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలకు ఇసుక అందుతుందని తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాకు చెక్..
దీని వల్ల అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను ప్రజలు సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.