438
అక్షరటుడే, కామారెడ్డి: Auto rickshaw overturns | ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం Kamareddy town లో చోటుచేసుకుంది. వరి నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Auto rickshaw overturns | పట్టణంలోకి చేరుకోగానే..
బాధితుల కథనం ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో వరి నాట్లు వేయడానికి ఆటోలో వెళ్లారు. సాయంత్రం అదే ఆటోలో తిరిగి ఇంటికి బయలుదేరారు.
కామారెడ్డి పట్టణంలోని ఎస్ ఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.