అక్షరటుడే, వెబ్డెస్క్ : TG EAPCET 2026 | తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యూల్ వెలువడింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ నోటిఫికేషన్ (Notification) ఫిబ్రవరి 14న వెలువడనుంది.
రాష్ట్రంలో ఇంటర్ తర్వాత ఎంతో మంది వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం ఉన్నత విద్యా మండలి ఈఏపీ సెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షల కోసం ఫిబ్రవరి 19 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో తర్వాత కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
TG EAPCET 2026 | పరీక్షలు ఎప్పుడంటే..
ఈఏపీ సెట్లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు (Pharmacy Entrance Exams) మే 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు (Engineering entrance exams) మే 9 నుంచి మే 11 వరకు జరుగుతాయి. ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి. హైదరాబాద్ జేఎన్టీయూ, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈఏపీసెట్ రాస్తారు.