More
    HomeతెలంగాణAshwini Vaishnav | 200 కొత్త రైళ్లు.. అవన్నీ కూడా తెలంగాణలోనే తయారీనా?

    Ashwini Vaishnav | 200 కొత్త రైళ్లు.. అవన్నీ కూడా తెలంగాణలోనే తయారీనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ashwini Vaishnav | రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) శుభవార్త అందించింది. దేశంలో కొత్తగా 200 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ(Railways Ministry) రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికులు చూపిస్తున్న ఆసక్తి నేపథ్యంలో వారికి సౌకర్య వంతమైన ప్రయాణాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో చాలావరకు తెలంగాణలోనే (Telangana) తయారవుతుడం విశేషం. వీటిలో అధునాతన ట్రైన్స్ ఉన్నాయి. ఇటీవలే రైల్వే ట్రాక్లు మార్చడంతో పాటు వాటి స్పీడ్ లిమిట్ కూడా పెంచడంతో దానికి తగ్గట్టుగా మోడ్రన్ రైళ్లను(Modern Trains) అందుబాటులోకి తెస్తున్నారు.

    Ashwini Vaishnav | సామాన్యుల క‌ష్టాలు తీరిన‌ట్టేనా?

    దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసారు. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లు(50 Namo Bharat trains), 100 మెమూ రైళ్లు, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు(50 Amrit Bharat trains) త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnav) ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్‌ చేశారు. అయితే, ఈ రైళ్లును ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే వివరాలను మాత్రం ఆయన పేర్కొనలేదు. లేటెస్ట్ గా తయారైన రైళ్లలో 50 నమో భారత్ ట్రైన్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఏసీతో ఉండే ప్యాసింజర్ ట్రైన్స్.

    ప్రయోగాత్మకంగా గుజరాత్‌లో అహ్మదాబాద్ నుంచి భుజ్, బిహార్‌లో పాట్నా నుంచి జయ్‌నగర్ వరకూ నడిపారు. వీటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరో 50 నమో భారత్ ఏసీ రైళ్లను(Namo Bharat AC trains) దేశవ్యాప్తంగా నడపడానికి రెడీ చేసారు. దేశవ్యాప్తంగా దగ్గర దూరాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్ళ కొరత విపరీతంగా ఉంది. దాన్ని అధిగమించడం కోసం రైల్వే శాఖ రైళ్లను రెడీ చేసింది. ఇవన్నీ తెలంగాణలోని కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ(Kazipet Railway Factory)లో తయారయ్యాయి. సాధారణంగా మెమూ రైళ్లకు 8-12 బోగీలు ఉంటాయి. కానీ కొత్తగా ప్రవేశపడుతున్న MEMU లకు 16-20 బోగీలు ఉండనున్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన నాన్-ఏసీ అమృత్ భారత్ రైళ్లు ప్రస్తుతం మూడు ఉన్నాయి. అవికాక 6రైళ్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు మరొక 50 అమృత్ భారత్ ట్రైన్లను తయారు చేస్తున్నట్టు అశ్విని వైష్ణవి ప్రకటించారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...