అక్షరటుడే, వెబ్ డెస్క్: MIM | ఎంఐఎం mim అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Asaduddin Owaisi ఫొటోను మార్ఫింగ్ చేసిన ఘటన కలకలం రేపింది.
నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్ జలీల్ తన ఫేస్బుక్ facebook ఐడీలో మార్ఫింగ్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ ఫొటోలు పోస్టు చేశారు. ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసుకున్నట్లు ఒవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసి, వెనకాల రామ్‌దేవ్ బాబా చిత్రం సైతం పెట్టాడు. దీంతో నగరానికి చెందిన ఎంఐఎం నాయకుడు mim leader మహ్మద్ ముజీబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఐదో టౌన్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా ఫొటోలు మార్ఫింగ్ చేసిన జలీల్ ఓ కాంగ్రెస్ అగ్రనేత అనుచరుడిగా సమాచారం. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
