అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి పట్టణంలో మొబైల్ షాప్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ‘గో బ్యాక్ మార్వాడీ’ (Go Back Marwadi) కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శుక్రవారం మొబైల్స్ షాప్స్ బంద్ (Mobile Shops Bandh) నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ క్రమంలో వారంతా.. బస్టాండ్ వద్ద ధర్నా చేయడానికి సన్నద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున చేరుకుని ధర్నా కార్యక్రమానికి నిలిపేశారు. 8 మంది మొబైల్ షాప్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులు, మొబైల్ షాప్ నిర్వాహకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు (Kamareddy Police) మాట్లాడుతూ.. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు చేయడానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.