అక్షరటుడే, వెబ్డెస్క్: AP RTC Road Accident | తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా Jogulamba Gadwal district పరిధిలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలో National Highway 44 పై చోటుచేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
AP RTC Road Accident | హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న బస్సు
అనంతపూర్ Anantapur డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారిపై బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
AP RTC Road Accident | వెంటనే సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల ద్వారా సమీపంలోని Kurnool ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా నిద్రమత్తే కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేషనల్ హైవే 44పై భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.