అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్ గురువారం వైమానిక దాడులకు దిగింది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా సరిహద్దు గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సరిహద్దు వెంబడి ఉన్న కంబోడియా సైనిక స్థావరాలే (Cambodian Military Bases) లక్ష్యంగా థాయిలాండ్ దాడులు చేపట్టింది.
Thailand AIR Strikes | ఆరు యుద్ధ విమానాలతో..
ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తలతో మొన్నటి వరకు పశ్చిమాసియా రగిలిపోగా.. తాజా దాడులతో ఆగ్నేయాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కంబోడియాలోని రెండు సైనిక లక్ష్యాలపై ఆరు F-16 యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు థాయిలాండ్ తెలిపింది. భూమిపై ఉన్న కంబోడియా సైనిక లక్ష్యాలను విజయవంతంగా చేధించాయని తెలిపింది.
Thailand AIR Strikes | ల్యాండ్‌మైన్ పేలిన మరుసటి రోజే..
థాయిలాండ్(Thailand), కంబోడియా మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం ఉంది. ఈ క్రమంలో బోర్డర్లో ల్యాండ్‌మైన్ పేలి థాయ్ సైనికుడు(Thai Soldier Killed By Landmine) కాలును కోల్పోయాడు. మరుసటి రోజే థాయిలాండ్ దాడులకు పాల్పడటం గమనార్హం. సరిహద్దు ఘర్షణలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో కంబోడియా రాజధాని నమ్ పెన్‌లోని థాయ్ రాయబార కార్యాలయం (Thai Embassy) తన పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. దీంతో ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థాయిలాండ్ వైమానిక దాడులు తమ భూభాగాన్ని తాకాయని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాడులపై నిర్ణయాత్మకంగా స్పందిస్తామని తెలిపింది. యుద్ధ విమానాలను మోహరించడానికి కొన్ని గంటల ముందు గురువారం సరిహద్దులో థాయ్, కంబోడియా దళాల మధ్య సాయుధ ఘర్షణలు చెలరేగినట్లు సైనిక అధికారులు తెలిపారు. కంబోడియా దాడుల్లో ఇద్దరు థాయ్ పౌరులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం వైమానిక దాడులు జరిపామన్నారు.
View this post on Instagram