HomeజాతీయంMaoist surrender | మావోయిస్టులకు మరో షాక్​.. 70 మందితో లొంగిపోనున్న కీలక నేత ఆశన్న

Maoist surrender | మావోయిస్టులకు మరో షాక్​.. 70 మందితో లొంగిపోనున్న కీలక నేత ఆశన్న

Maoist surrender | మావోయిస్టులు లొంగు‘బాట’ పట్టారు. ఉద్యమ బాట వీడి రాజ్యం ముందు సరెండర్​ అవుతున్నారు. అడవులను వీడి జన జీవనంలోకి వస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్​రావు 61 మందితో లొంగిపోగా.. తాజాగా ఆశన్న 70 మంది అనుచరులతో సరెండర్​ కానున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist surrender | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. పార్టీ కీలక నేత ఆశన్న (Ashanna) లొంగిపోతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన 70 మంది అనుచరులతో ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ (Chhattisgarh CM Vishnu Dev) సమక్షంలో ఆయుధాలు అప్పగించనున్నారు.

ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో కకావికలం అవుతున్న మావోయిస్టులకు వరుస షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్​కౌంటర్​లతో వందలాది మంది చనిపోతుండగా.. అగ్రనేతలు లొంగు‘బాట’ పట్టడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మావోయిస్ట్​ కమిటీ పోలిట్​ బ్యూరో సభ్యులు మల్లోజులు వేణుగోపాల్​రావు (Mallojula Venygopal) బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ఎదుట 61 మందితో కలిసి లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న సరెండర్​ అవుతున్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో జగదల్‌పూర్‌కు చేరుకున్నారు. ఆశన్న ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

Maoist surrender | కీలక సభ్యులు

ఇప్పటికే ఆపరేషన్​ కగార్​తో మావోయిస్ట్​ ఉద్యమం బలహీనం అయింది. కొత్తగా రిక్రూట్​మెంట్లు లేవు. ఎన్​కౌంటర్లలో వందలాది మంది చనిపోతుండటంతో పలువురు నేతలు సరెండర్​ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇటీవల మల్లోజుల లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన లొంగిపోగా.. తాజాగా ఆశన్న సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. కీలక నేతలు సరెండర్​ అవుతుండటంతో వారి అనుచరులు సైతం అదే బాటలో నడుస్తున్నారు. ప్రస్తుతం ఆశన్నతో పాటు దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్‌మన్, రనితతో సహా పలువురు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు లొంగిపోతున్నట్లు సమాచారం.

Maoist surrender | ఖమ్మం జిల్లా నుంచి..

ఆశన్న 1970లో ఖమ్మం జిల్లాలో జన్మించారు. విప్లవ ఉద్యమం పట్ల ఆకర్శితుడై 1990లో మావోయిస్టుల్లో చేరాడు. బాంబు తయారీ, ఆయుధాల తయారీ, గెరిల్లా వార్‌ఫేర్‌లో ఆరితేరాడు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆశన్న పాత్ర ఉంది. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాలు, ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.