ePaper
More
    HomeFeaturesSamsung Galaxy F36 | శాంసంగ్‌నుంచి మరో ఫోన్‌.. సేల్స్‌ ఎప్పటినుంచంటే..

    Samsung Galaxy F36 | శాంసంగ్‌నుంచి మరో ఫోన్‌.. సేల్స్‌ ఎప్పటినుంచంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Galaxy F36 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌(Samsung) మరో ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌36(Galaxy F36) పేరులో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో ఈనెల 29వ తేదీనుంచి అందుబాటులో ఉండనుంది. అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉన్న ఈ మోడల్‌ విశేషాలు తెలుసుకుందామా..

    డిస్‌ప్లే:6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్‌ రేట్‌తో తీసుకువచ్చారు. 2340 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌ ఇస్తుంది.
    వెనుక వైపు వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ 7.7 ఎంఎం థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

    కెమెరా:ఇది వెనకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌(ఐవోఎస్‌) సపోర్టుతో 50 MP ప్రైమరీ కెమెరాను, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2 ఎంపీ మాక్రో సెన్సార్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 13 ఎంపీ కెమెరా ఉంది. 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    బ్యాటరీ:5000 mAh లిథియం బ్యాటరీ ఉంది. ఇది 25w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

    చిప్‌సెట్‌:శాంసంగ్‌ Exynos 1380 SoC ఆక్టాకోర్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌:ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

    అదనపు ఫీచర్లు:గూగుల్‌ జెమిని(Google Gemini), సర్కిల్‌ టూ సెర్చ్‌, ఇమేజ్‌ క్లిప్పర్‌, ఆబ్జెక్ట్‌ ఎరేజర్‌, ఎడిట్‌ సజెషన్స్‌ వంటి ఏఐ ఫీచర్లున్నాయి.

    అప్‌డేట్స్‌:ఈ మోడల్‌కు ఆరేళ్ల వరకు ఓఎస్‌(OS) అప్‌డేట్స్‌ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా ఆరేళ్ల పాటు ఇవ్వనున్నట్లు తెలిపింది.

    వేరియంట్స్‌:కోరల్‌ రెడ్‌, లూక్స్‌ వయోలెట్‌, ఆనిక్స్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభిస్తోంది.
    6GB + 128GB వేరియంట్‌ ధర రూ. 17,499.
    8GB + 128GB వేరియంట్‌ ధర రూ. 18,999.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...