అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme P4 | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన రియల్‌మీ (Realme).. పీ సిరీస్‌లో మరో మోడల్‌ను లాంచ్ చేయడానికి సన్నద్ధమయ్యింది. శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రియల్‌మీ పీ4 (Realme P4) పేరుతో తీసుకువస్తున్న ఈ ఫోన్‌ను ఈనెల 20న లాంచ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌తో (Flipkart) పాటు రియల్‌మీ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. 7.68 ఎంఎం మందం కలిగి ఉన్న ఈ ఫోన్ ఈ సెగ్మెంట్‌లో స్లిమ్మెస్ట్ మోడల్ అని కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలిలా ఉన్నాయి.
6.77 అంగుళాల హైపర్‌గ్లో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఐపీ 65, ఐపీ 66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తోంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌ను అమర్చారు. అంటుటు స్కోర్ 11,10,000గా ఉంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వెనకవైపు 50 MP డ్యుయల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. 4k వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఏఐ ఇమేజింగ్ అసిస్టెంట్, ఏఐ ఎడిట్ జెనీ, ఏఐ ట్రావెల్ స్నాప్, ఏఐ లాండ్‌స్కేప్, ఏఐ పార్టీ మోడ్‌లతో వస్తోంది. ముందువైపు సెల్ఫీల కోసం 16 MP వైడ్ అంగిల్ సెన్సార్ ఉంది.
7,000mAh టైటాన్ బ్యాటరీ అమర్చనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది 80w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 47 నిమిషాలు ఛార్జ్ చేస్తే 17 గంటలపాటు వీడియో ప్లే అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇది రివర్స్ ఛార్జింగ్, ఏఐ స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్‌లో వినియోగదారులు 11 గంటల వరకు బీజీఎంఐ ప్లే చేయొచ్చని కంపెనీ పేర్కొంది. వేడిని నియంత్రించడానికి 7,000 ఎస్‌క్యూ ఎంఎం ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంగల ఈ వేరియంట్ ఫోన్ ధర రూ. 30 వేలలోపు ఉండే అవకాశాలు ఉన్నాయి.