ePaper
More
    HomeFeaturesOne Plus | ఆకట్టుకునే ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌ నుంచి మరో ఫోన్‌.. సేల్స్‌ ఎప్పటి నుంచంటే..

    One Plus | ఆకట్టుకునే ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌ నుంచి మరో ఫోన్‌.. సేల్స్‌ ఎప్పటి నుంచంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : One Plus | చైనా(China)కు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ అయిన వన్‌ ప్లస్‌(Oneplus) ఆకట్టుకునే ఫీచర్స్‌తో మరో మోడల్‌ ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈనెల 8వ తేదీన భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 5ని విడుదల చేయనుంది. 9వ తేదీ మధ్యాహ్నం నుంచి అమెజాన్‌ (Amazon)తో పాటు వన్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌లో సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటించనప్పటికీ లీకైన సమాచారం మేరకు ఈ మోడల్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

    డిస్‌ప్లే:6.83 inch ఫుల్‌ హెచ్డీ + అమోలెడ్‌ డిస్‌ ప్లే 1.5k రిజల్యూషన్‌, 144 Hz రిఫ్రెష్‌ రేట్‌, IP65 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ కలిగి ఉంది.

    ప్రాసెసర్‌: క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s gen 3 చిప్‌సెట్‌ అమర్చారు. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం ఎల్‌పీడీడీఆర్‌5ఎక్స్‌ రామ్‌, యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజీ ఉంది. లార్జెస్ట్‌ వీసీ కూలింగ్‌ సిస్టమ్‌ కలిగి ఉన్న ఈ ఫోన్‌ సుదీర్ఘ గేమింగ్‌ సెషన్స్‌లోనూ వేడిని నియంత్రిస్తుంది.

    సాఫ్ట్‌వేర్‌: ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఆక్సిజన్‌ OS 15 ఆపరేటింగ్‌ సిస్టం

    కెమెరా: వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ సోనీ LYT 700 మెయిన్‌ కెమెరా(OIS సపోర్ట్‌)తో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరాతో కూడిన డ్యూయల్‌ కెమెరా సెట్‌ అప్‌, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగా పిక్సెల్‌ సాంసంగ్‌ జేఎన్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ మల్టీఫేస్‌ ఆటో ఫోకస్‌ కేపబిలిటీతో వస్తోంది. లైవ్‌ ఫొటో, హెచ్‌డీఆర్‌, పనోరమ, AI ఫొటో, వీడియో ఎన్‌హాన్స్‌మెంట్‌ వంటి ఫీచర్లున్నాయి.

    బ్యాటరీ:5200 mAh బ్యాటరీ. 80w SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌. 40 నిమిషాలలో 100 శాతం ఛార్జింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి.

    కలర్స్‌ :లైట్‌ బ్లూ, ఆఫ్‌ వైట్‌, మార్బుల్‌ సాండ్స్‌, నెక్లస్‌ బ్లూ.

    వేరియంట్లు: 8 GB ర్యామ్‌ + 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 30 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి. 12 GB ర్యామ్‌ + 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 36 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...