HomeతెలంగాణTelangana Bandh | బీసీ రిజర్వేషన్ల కోసం మరో ఉద్యమం : కల్వకుంట్ల కవిత

Telangana Bandh | బీసీ రిజర్వేషన్ల కోసం మరో ఉద్యమం : కల్వకుంట్ల కవిత

Telangana Bandh | బీసీ బంద్​కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్​లో మానవహారం నిర్వహించారు. కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Telangana Bandh | రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ (BC JAC) ఆధ్వర్యంలో శనివారం బంద్​ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్​లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పాల్గొన్నారు.

కవిత జూబ్లీహిల్స్​లోని జాగృతి కార్యాలయం నుంచి ఖైరతాబాద్ (Khairatabad)​ వరకు ఆటోలతో ర్యాలీగా వచ్చారు. అనంతరం బంద్ (BC Bandh)​కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఆమె నిరసన తెలిపారు. కవిత కుమారుడు ఆదిత్య సైతం ఆందోళనలో పాల్గొన్నారు.

Telangana Bandh | బీసీలను మోసం చేస్తున్నాయి

కవిత మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేస్తామన్నారు. బీసీ బంద్​కు మద్దతుగా ఖైరతాబాద్​ చౌరస్తాను బ్లాక్​ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress) పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana Bandh | ఆ పార్టీలు పాల్గొనడం దారుణం

ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలో ఆ పార్టీలు కూడా బీసీ బంద్ లో పాల్గొనడం నవ్వులాటగా అనిపిస్తోందని కవిత విమర్శించారు. రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలపాల్సిన బీజేపీ, దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీలు బంద్​లో పాల్గొనడం దారుణమన్నారు. బీసీ బిడ్డలను మభ్యపెట్టొద్దని, మోసం చేయొద్దని ఆమె కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకూ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.