అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Canara Robeco IPO | కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్‌ఏఎంసీ)ని 1993లో స్థాపించారు. ఇది భారతదేశంలోని ఆస్తి నిర్వహణ సంస్థ. ఇది కెనరా రోబెకో(Canara Robeco ) మ్యూచువల్ ఫండ్‌కు పెట్టుబడి నిర్వాహకుడిగా పనిచేస్తోంది.
ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబయిలో ఉంది. ఇది కెనరా బ్యాంక్(Canara bank) మరియు ఒరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్‌వీ (గతంలో రోబెకో గ్రూప్ ఎన్‌వీ) మధ్య జాయింట్ వెంచర్‌గా పనిచేస్తోంది. సీఆర్‌ఏఎంసీ ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్ పథకాల(Hybrid scheme)తో సహా విభిన్న శ్రేణి పెట్టుబడి ఎంపికలను అందిస్తోంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ 26 పథకాలను నిర్వహిస్తోంది.
ఇందులో 15 ఈక్విటీ ఆధారిత పథకాలు (12 ఈక్విటీ పథకాలు మరియు మూడు హైబ్రిడ్ పథకాలు), మిగిలిన 11 రుణ ఆధారిత పథకాలు (10 రుణ పథకాలు మరియు ఒక హైబ్రిడ్ పథకం). ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 1,326.13 కోట్లను సమీకరించనుంది. రూ. 10 ముఖ విలువ(Face value) కలిగిన 4.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు.
Canara Robeco IPO | ఆర్థిక సమాచారం..
అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆదాయం(Revenue) 27 శాతం, పన్ను తర్వాత లాభం(PAT) 26 శాతం పెరిగింది.
Canara Robeco IPO | ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్..
ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 253 నుంచి రూ. 266గా నిర్ణయించారు. ఒక లాట్(Lot)లో 56 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్(Price band) వద్ద రూ. 14,896 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్‌ల కోసం బిడ్ వేయవచ్చు.
Canara Robeco IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల(Retail investors)కు 35 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 35 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 13 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Canara Robeco IPO | ముఖ్యమైన తేదీలు..
- సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం : అక్టోబర్ 9
- ముగింపు : అక్టోబర్ 13
- అలాట్‌మెంట్ : అక్టోబర్ 14
- లిస్టింగ్ తేదీ : అక్టోబర్ 16 వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతుంది.