Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అక్షరటుడే, ఇందూరు: Ankit IAS Transfer | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన మార్పుల్లో భాగంగా మొత్తంగా 45మంది అధికారులను ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీఎస్​ రామకృష్ణారావు ఆదేశాలిచ్చారు.

Ankit IAS Transfer | అదనపు కలెక్టర్​ అంకిత్​..

ఈ భారీ బదిలీల్లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్​ అంకిత్​ (Additional Collector Ankit)ను బదిలీ చేస్తూ ఆదేశాలు అందాయి. ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2019 బ్యాచ్​కు చెందిన ఆయన కొన్నేళ్లుగా అదనపు కలెక్టర్​గా నిజామాబాద్​ జిల్లాలో సేవలందించారు. అక్కడ కలెక్టర్​ను జితేష్​ వి పాటిల్​ను టీజీఎస్​పీడీసీఎల్​ ఛైర్మన్​, ఎండీగా బదిలీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లాకు ఎవరికీ కేటాయించలేదు.

Ankit IAS Transfer | కలెక్టర్లు సైతం..

మహబూబాబాద్ కలెక్టర్ (Mahabubabad Collector) అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం హనుమంత రావు ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్​ ఫైనాన్స్​ శాఖ స్పెషల్ సెక్రెటరీగా, జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్​ జా జీహెచ్​ఎంసీ జోనల్ కమిషనర్​గా ట్రాన్స్​ఫర్​ అయ్యారు. కరీంనగర్​ కలెక్టర్ పమీల సత్పత్తి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా, జీహెచ్​ఎంసీ జోనల్​ కమిషనర్​ అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) కలెక్టర్​గా నియామకం అయ్యారు. మెదక్​ కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సహకార శాఖ స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రార్‌గా, జనగాం కలెక్టర్ రిజ్వానాబాషా షేక్​ గద్వాలకు బదిలీ అయ్యారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.