Homeభక్తిTTD EO | టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్​కుమార్​ సింఘాల్​

TTD EO | టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్​కుమార్​ సింఘాల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD EO | టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ (Anil Kumar Singhal) బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఐఏఎస్​ల బదిలీ చేపట్టిన ప్రభుత్వం ఆయనను ఈవోగా నియమించిన విషయం తెలిసిందే.

అనిల్​కుమార్​ సింఘాల్​ బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల (Tirumala)కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

TTD EO | ఎన్నో జన్మల పుణ్యఫలం

టీటీడీ ఈవోగా పని చేసిన శ్యామల రావును ప్రభుత్వం జీఏడీ (GAD) ముఖ్య కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. బదిలీపై వెళ్తున్న ఆయనను మంగళవారం సాయంత్రం టీటీడీ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ.. టీటీడీలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని తెలిపారు. 14 నెలల పాటు ఆయన ఈవోగా పని చేశారు. తన కాలంలో దూరదృష్టితో విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు.

TTD EO | మొదటి అధికారిగా రికార్డు

టీటీడీ ఈవోగా రెండో సారి నియమితులైన మొదటి అధికారిగా సింఘాల్ నిలిచారు. ఆయన గతంలో 2017 మే నుంచి 2020 అక్టోబర్​ వరకు ఈవోగా పనిచేశారు. తాజాగా మళ్లీ ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పలు కీలక సంస్కరణలు అమలు చేయడంతో ప్రభుత్వం రెండోసారి అవకాశం కల్పించింది. గతంలో ఆయన టైమ్​ స్లాట్​ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశ పెట్టారు. అంతేగాకుండా శ్రీవాణి ట్రస్ట్​ (Srivani Trust)ను రూపొందించారు. ఈ ట్రస్ట్ ద్వారా టీటీడీ నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది.