Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Anil Ambani ED | రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసు (Money Laundering Case) విచారణలో భాగంగా ఈడీ ముందు హాజరయ్యారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) తో ముడిపడి ఉన్న బ్యాంకు రుణ మోసం కేసులో 66 ఏళ్ల వ్యాపార దిగ్గజం రెండో సారి విచారణకు వచ్చారు.

రూ.40 వేల కోట్ల విలువైన బ్యాంకు మోసం చుట్టూ తిరుగుతున్న మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీ గురువారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు హాజరయ్యారు. RCOM, అనిల్ అంబానీ. ఇతరులపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద CBI నమోదు చేసిన FIR ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించింది. RCOM, దాని గ్రూప్ కంపెనీలు 2010-2012 కాలం నుంచి దేశీయ, విదేశీ రుణదాతల నుంచి రుణాలు పొందాయి. వీటిలో మొత్తం రూ.40,185 కోట్లు బకాయి ఉన్నాయి. 9 బ్యాంకులు గ్రూప్ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా ప్రకటించాయి.

Anil Ambani ED | అంబానీ నివాసం జప్తు

ఆర్​కామ్​, దాని గ్రూప్ కంపెనీలు రుణాలను దుర్వినియోగం చేశాయి. అనుబంధ కంపెనీలకు నిధులు మళ్లించాయి. అనంతరం వాటిని ఫిక్స్​డ్​ డిపాజిట్​, మ్యూచ్​వల్​ ఫండ్లలో పెట్టుబడి పెట్టాయి. వీటిని గ్రూప్ సంస్థలకు తిరిగి మళ్లించడం కోసం గణనీయంగా రద్దు చేసింది. అనుబంధ పార్టీలకు నిధులను మళ్లించడానికి బిల్ డిస్కౌంటింగ్‌ను భారీగా దుర్వినియోగం చేసినట్లు కూడా ED గుర్తించింది. విదేశీ ఔట్‌వర్డ్ రెమిటెన్స్‌ల ద్వారా భారతదేశం వెలుపల కొన్ని రుణాలు మళ్లించబడ్డాయి. గురువారం ED రూ.3,761 కోట్ల విలువైన అనిల్ అంబానీ నివాసాన్ని జప్తు చేసింది. దీని మొత్తం అటాచ్‌మెంట్ రూ. 15,000 కోట్లకు పైగా ఉంది.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.