అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Shradhanand Ganj | నగరంలోని (Nizamabad city) గంజ్ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మూడో టౌన్ ఎస్సై హరిబాబు (SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున శ్రద్ధానంద్ ఏరియా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి (37) షెడ్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం గమనించిన కూలీలు వెంటనే మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే మూడో టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.