అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Odisha Encounter | ఒడిశాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు.
కంధమాల్ జిల్లా (Kandhamal District)లోని బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కోటగఢ్లో మోహరించిన స్థానిక సిబ్బందితో కూడిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) కూంబింగ్ (Coombing) చేపట్టింది. ఆ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు. బలగాలు ఘటనా స్థలం నుంచి ఒక రివాల్వర్, ఒక 303 తుపాకీ, వాకీ-టాకీని స్వాధీనం చేసుకున్నాయి.
Odisha Encounter | రూ.23.65 లక్షల రివార్డు
మృతులను బన్సధార-ఘుమ్సర్-నాగబలి (బీజీఎన్) డివిజన్ కింద రాయగడ ఏరియా కమిటీ సభ్యుడు, సుక్మాకు చెందిన బారి అలియాస్ రాకేష్‌గా గుర్తించారు. మరొకరు సప్లై దళంలో ఉన్న బిజాపూర్ (Bijapur)కు చెందిన అమృత్ అని తెలిపారు. బారిపై రూ. 22 లక్షలు, అమృత్‌పై రూ. 1.65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని బలగాలను మోహరించామని ఏడీజీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) సంజీబ్ పాండా తెలిపారు.